ఉమామహేశ్వర దైవ దర్శనం మూడు రోజులు బంద్

NGKL: జిల్లాల కురుస్తున్న భారీ వర్షాలకు అచ్చంపేట మండలం ఉమామహేశ్వర దేవస్థానం కొండపై నుంచి రోడ్డుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజులపాటు ఉమామహేశ్వర దైవ దర్శనం బంద్ చేస్తున్నట్లు ఎస్సై విజయ భాస్కర్ తెలిపారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగరాజు, ఆలయ ఛైర్మన్ బీరం మాధవరెడ్డితో కలిసి ఈరోజు ఉమామహేశ్వర పరిసరాలను పరిశీలించారు.