రేపు యథాతథంగా ‘ప్రజావాణి’

రేపు యథాతథంగా ‘ప్రజావాణి’

ఆదిలాబాద్‌: కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రజలు చిన్నపాటి సమస్యల కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, మండల కేంద్రాల్లోనే ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. డిజిటల్ ఫిర్యాదులకు సమాధానం ఇవ్వడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.