శ్రీవారిని దర్శించుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే
NDL: కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని ఇవాళ నందికొట్కూరు MLA గిత్త జయసూర్య దర్శించుకున్నారు. ఆలయ గోపురం వద్ద కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. శ్రీవారి దర్శనం కలగడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.