ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

MBNR: ఇటీవల జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికలలో విజయం సాధించిన ఇండిపెండెంట్ ప్యానెల్ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు నరేందర్ చారి ఆధ్వర్యంలో గెలుపొందిన సభ్యులు బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలిశారు. ప్రెస్ క్లబ్ ఆధునీకరణకు సహకరించాల్సిందిగా కలెక్టర్‌ను కోరారు.