ఆదిశిల క్షేత్రాన్ని సందర్శించిన సివిల్ జడ్జ్
GDWL: మల్దకల్ మండల కేంద్రంలో వెలసిన ఆదిశిల వెంకటేశ్వర స్వామిని బుధవారం జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ దంపతులు నేరెళ్ల వెంకట హైమ పూజిత దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వీరికి, ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనం ఎంతో ఆనందాన్నిచ్చిందని జడ్జ్ దంపతులు తెలిపారు.