VIDEO: మండల వ్యాప్తంగా చెరువుల్లో 48 వేల చేప పిల్లలు విడుదల
SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని వివిధ చెరువుల్లో 48 వేల చేప పిల్లలను బుధవారం విడుదల చేసినట్లు ఫిషరీస్ శాఖ ఫీల్డ్ అసిస్టెంట్ రాకేష్ రెడ్డి తెలిపారు. స్థానిక మత్స్య కార్మికులు ముదిరాజ్ సంఘం సభ్యులతో కలిసి స్థానిక సాకీ చెరువులో 36 వేలు, శీలం చెరువులో 12 వేలు ప్రభుత్వం ఉచితంగా అందజేసిన చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో AO హరికృష్ణ ఉన్నారు.