విద్యార్థులకు కిట్ల కోసం నిధులు మంజూరు

విద్యార్థులకు కిట్ల కోసం నిధులు మంజూరు

AP: 2026-27 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు కిట్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 830.04 కోట్ల నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. నోట్, పాఠ్య పుస్తకాలు, బెల్ట్, షూలు, బ్యాగ్, 3 జతల యూనిఫాం క్లాత్‌లను ఇవ్వనున్నారు. సర్వేపల్లి రాధా కృష్ణన్ విద్యార్థి మిత్ర పేరిట వీటిని పంపిణీ చేయనున్నారు.