తప్పు లేకున్నా కోర్టు మెట్లు ఎక్కా: సబితా

TG: ఓబుళాపురం మైనింగ్ కేసుకు సంబంధించి మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్లు ఎక్కామని నాడు బాధపడ్డాను. న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం కలుగుతుందని నమ్మాను న్యాయం జరిగింది. పన్నెండున్నర ఏళ్లు అనేక అవమానాలు భరించాను. ఎన్నికలు వచ్చినప్పుడల్లా అవినీతి పరురాలు అంటూ ప్రచారాలు చేశారు' అని పేర్కొన్నారు.