AITUC రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: రాధాకృష్ణ
గుంటూరు: తిరుపతిలో ఈ నెల 26 నుంచి జరగనున్న AITUC రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఫెడరేషన్ నాయకుడు వి. రాధాకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్తపేట సీపీఐ కార్యాలయంలో మహాసభల పోస్టర్లను నాయకులు విడుదల చేశారు. 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు ఈ సభలు జరుగుతాయని తెలిపారు.