ఉపన్యాస పోటీల్లో కేశవర్ధన్‌కు ప్రథమ బహుమతి

ఉపన్యాస పోటీల్లో కేశవర్ధన్‌కు ప్రథమ బహుమతి

GDWL: తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలలో మల్దకల్ మండలం అమరవాయి ZPHS విద్యార్థి కేశవర్ధన్ ప్రథమ బహుమతి సాధించాడు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ బి.ఎం. సంతోష్ ఆ విద్యార్థిని బహుమతి అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. విద్యార్థి ప్రతిభను కలెక్టర్ మెచ్చుకున్నారు.