VIDEO: భక్తుల వెల్లువ… గద్దెల వద్ద కిక్కిరిసిన జనం
MLG: మేడారంలో వనదేవతలు రాత్రి గద్దెల మీదకి చేరడంతో దర్శనానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఉదయం నుంచే లక్షలాది మంది భక్తులు మేడారం వైపు తరలివచ్చి అమ్మవార్ల దర్శనం కోసం క్యూల్లో బారులు తీరారు. గద్దెల ప్రాంగణం జనసంద్రంగా మారగా, సాధారణంతో పాటు వీఐపీ, వీవీఐపీ దర్శనాల క్యూలు కూడా కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖులు వనదేవతలను దర్శించుకుంటున్నారు.