వృద్ధులకు చీరలు పంపిణీ చేసిన ఫాదర్ విజయ్ కుమార్

వృద్ధులకు చీరలు పంపిణీ చేసిన ఫాదర్ విజయ్ కుమార్

కృష్టా: పేదలకు సహాయం చేయడంలో యువత ముందుండాలని ఫాదర్ గోళ్ల విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు ఆర్.సీ.యం చర్చలో స్థానిక యువత ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. యువతీ, యువకులు సమాజంలో సేవా భావాన్ని కలిగి ఉండాలన్నారు. యువత సేవ చేయడం ద్వారా తప్పుదోవ పట్టకుండా ఉంటారని సూచించారు.