సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను పరిశీలించిన ఎంపీ
NDL: కలుషిత నీరు తాగి రోగాల భారినపడితే ఎవరు బాద్యులనీ, సమ్మర్ స్టోరేజ్‌ను శుభ్రం కూడా చేయలేరా..! అంటూ సంబంధిత కాంట్రాక్టరుపై ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పగిడ్యాల మండలం లక్ష్మా పురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను ఎంపీ పరిశీలించారు. నీటిని సరిగ్గా శుద్ధి చేసి ప్రజలకు దాహార్తిని తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలనీ ఆదేశించారు.