అద్దె భవనంలోనే పాఠశాల

VZM: రేగిడి మండలం చిన్నయ్య పేట ప్రాథమిక పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతోంది. పదేళ్ల క్రితం శిథిలావస్థలో ఉన్న ఈ పాఠశాలను విద్యాశాఖ అధికారులు నేలమట్టం చేశారు. నాటి నుంచి నేటి వరకు అద్దె భవనంలోనే పాఠశాల కొనసాగుతుంది. నాడు- నేడులో పక్కా భవనం మంజూరు కాలేదు. మూడో విడతలో పక్కా భవనం మంజూరై ఏడాదిన్నర పూర్తయినా నేటి వరకు ఆ భవనం పూర్తి కాలేదు.