VIDEO: అధ్వానంగా మారిన చాగాపురం ప్రధాన రహదారి
GDWL: ఇటిక్యాల మండల కేంద్రం నుంచి చాగాపురం ప్రధాన రహదారి అధ్వానంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగున గుంతలు ఏర్పడి రోడ్డు ప్రమాదభరితంగా మారడంతో ప్రయాణికులు నరకయాతనను ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయాల్లో కల్వర్టుల దగ్గర భయాందోళనకు గురవుతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.