నగరపాలక కార్యాలయంలో నేడు 'పీజీఆర్ఎస్'

చిత్తూరు నగరపాలక కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరిస్తామని తెలిపారు. బాధిత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.