VIDEO: రెండు కిలోమీటర్లు జోల కట్టి మోసుకెళ్లిన కుటుంబం
MLG: వెంకటాపురం మండలంలో మిర్చి పంటకు కోతకు వచ్చిన ఓ వలస కూలీ అస్వస్థతకు గురయ్యాడు. మిర్చి తోటలోనే పరిస్థితి విషమించింది. కుటుంబ సభ్యులు బాధితుడిని జోల కట్టి సుమారు రెండు కిలోమీటర్లు మోసుకొని వచ్చి, స్వగ్రామమైన బాసగుడా, ఛత్తీస్‌గఢ్‌కు తీసుకెళ్లేందుకు బుధవారం వెంకటాపురం బస్టాండ్‌కు తరలించారు. అక్కడ నుంచి బాధితుని వెంటనే ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.