వరద బాధితులకు నిత్యావసర సరుకులు

SRPT: భారీ వర్షాలకు నడిగూడెం మండల కేంద్రం లోని ఎస్సీ, బీసీ కాలనీలలోని పలువురి ఇళ్ల లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో శుక్రవారం సాయంత్రం నడిగూడెంకు చెందిన సామాజిక కార్యకర్త వల్లెపు శ్రీనివాస్ 45 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాతకొట్ల శ్రీనివాస్, దున్నా లింగయ్య, రాజు, గుర్వయ్య, రవి, ఆనంద్ పాల్గొన్నారు.