రైతుల కోసం టోల్ ఫ్రీ ఏర్పాటు: కలెక్టర్

రైతుల కోసం టోల్ ఫ్రీ ఏర్పాటు: కలెక్టర్

JN: ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కంట్రోల్ రూమ్‌ను కలెక్టరేట్‌లో గురువారం ప్రారంభించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 వరకు ఈ కంట్రోల్ రూమ్‌లో ఫిర్యాదులు తీసుకుంటారని తెలిపారు. ధాన్యం రవాణా, గోనె సంచులు, కొనుగోలు ప్రక్రియపై ఫిర్యాదుల కోసం 8520991823 నంబర్‌ ద్వారా సంప్రదించాలన్నారు.