తెనాలిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించి, సేవల అమలు, సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై సమీక్షించారు. లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని అధికారులకు ఆదేశించారు.