VIDEO: 'పంట కొనుగోలులో రాజకీయాలా'
BHNG: రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన రైతు మందడి సాగర్ రెడ్డికి చెందిన వరి ధాన్యాన్ని మిల్లు యాజమాన్యం అన్లోడింగ్ చేయకపోవడం పట్ల నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించగా స్పందించకపోవడంతో సివిల్ సప్లై జీఎంతో ఫోన్లో మాట్లాడారు. కొనుగోలులో కూడా రాజకీయాలా? అంటూ ఆవేదన చెందారు.