'బీసీ హాస్టళ్ల విద్యార్థులకు బ్లాంకెట్లు, దుప్పట్లు అందించాలి'
NRML: జిల్లాలో చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంబడి చంద్రశేఖర్ జిల్లా అధికారులతో శనివారం మాట్లాడారు. బీసీ హాస్టళ్లు, బీసీ రెసిడెన్షియల్ గురుకులాల్లో ఉన్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఉష్ణోగ్రతలు తగ్గుతున్న దృష్ట్యా విద్యార్థులకు వేడి నీళ్లు, బ్లాంకెట్లు, దుప్పట్లు సరిపడా అందించాలని కోరారు.