అధ్వాన్నంగా రోడ్డు.. అంబులెన్స్‌లోనే మహిళ ప్రసవం
PPM: రహదారి అధ్వాన్నంగా ఉండడంతో గర్భిణీ అంబులెన్స్‌లోనే ప్రసవించిన ఘటన కొమరాడ మండలం పరిధిలోని పూడేసి పంచాయతీ కోన గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వసంతకు శనివారం ప్రసవ నొప్పులు వచ్చాయి. వెంటనే అంబులెన్స్‌ను పిలిచి అసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే వసంత శిశివుకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఊపిరీ పీల్చుకున్నారు.