సంచార-అర్ధసంచార జాతుల విముక్తి దినోత్సవం

కృష్ణా: ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఆధ్వర్యంలో ఆగస్టు 30న విజయవాడలో సంచార-అర్ధసంచార జాతుల విముక్తి దినోత్సవం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్ తెలిపారు. సోమవారం మచిలీపట్నంలో కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ప్రధాని మోడీ సంచార జాతుల సంక్షేమం కోసం డీఎన్టీ కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పారు.