రామతీర్థంలో "సహస్ర దీపాలంకరణ"

రామతీర్థంలో "సహస్ర దీపాలంకరణ"

VZM: ప్రసిద్ధ పుణ్య క్షేత్రం రామతీర్థం దేవస్థానంలో అర్చకులు సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్తీకమాసం సందర్బంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. స్వామివారికి ప్రాతఃకాలార్చన, బాలభోగం చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్, కార్య నిర్వహణ అధికారి వై.శ్రీనివాసరావు, వైదిక సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.