అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD: పటాన్‌చెరులోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో చేపట్టనున్న ఇండోర్ సబ్ స్టేషన్ పనులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటి సారిగా పటాన్‌చెరులో రూ.12 కోట్ల నిధులతో ఇండోర్ సబ్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ నాగరాజు, నాయకులు అంతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.