రెండు రోజుల పాటు 'మీ సేవ' కేంద్రాల సేవలు బంద్

రెండు రోజుల పాటు 'మీ సేవ' కేంద్రాల సేవలు బంద్

ఆసిఫాబాద్ జిల్లాలో మీ-సేవ కేంద్రాల సేవలు రెండు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి రెండు రోజులపాటు ఈ సేవలు ఉండవు. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం నిర్వహిస్తున్న మెయింటెనెన్స్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని నిర్వాహకులు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి మీ-సేవలు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు.