మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: సీఐ

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: సీఐ

ASR: మద్యం సేవించి వాహనాలు నడిపితే ఆ వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని అరకు సీఐ హిమగిరి తెలిపారు. వాహనాల సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల పెనాల్టీ, జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. పొగమంచు కారణంగా నాలుగు రోజులుగా వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ ఆదేశాలతో అరకు ఘాటీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు భారీ వాహన రాకపోకలు నిషేధించబడ్డాయన్నారు.