ప్రపంచ జనాభా దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

ELR: జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం 2025 పోస్టర్లను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు. ప్రణాళికా బద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణల మధ్య ఆరోగ్యకరమైన సమయం చాలా అవసరమన్నారు. వివాహ వయస్సును ఆడవారికి 21 సంవత్సరాలు మగవారికి 25 సంవత్సరాలు పాటించాలన్నారు.