విశ్రాంత రైల్వే ఉద్యోగులకు ఉచిత వైద్యశిబిరం

విశ్రాంత రైల్వే ఉద్యోగులకు ఉచిత వైద్యశిబిరం

GNTR: గుంటూరు రైల్వే డివిజనల్ ఆసుపత్రిలో శనివారం విశ్రాంత రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. నగరంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లతో పాటు కంటి శుక్లాలకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు.