ఈనెల 10న జిల్లాకు రానున్న వైయస్. షర్మిల

ఈనెల 10న జిల్లాకు రానున్న వైయస్. షర్మిల

ATP: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఈ నెల 10, 11 తేదీల్లో శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పుట్టపర్తి, అనంతపురంలో నేతలు, కార్యకర్తలతో సమావేశమై జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం తదితర అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.