ఎస్సీ కళాశాల బాలుర వసతి గృహం తనిఖీ

ఎస్సీ కళాశాల బాలుర వసతి గృహం తనిఖీ

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ కళాశాల బాలుర వసతి గృహాన్ని ఇవాళ జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి దుర్గాప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ పరిసరాలు, స్టోర్, కిచెన్, విద్యార్థుల గదులను పరిశీలించి అనంతరం భోజనం వడ్డించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని సూచించారు.