గోదాం తనిఖీ చేసిన తహసీల్దార్
MDK: తూప్రాన్ బియ్యం నిలువ గోదామును తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ దుకాణాల ద్వారా మూడు నెలల రేషన్ బియ్యం వినియోగదారులకు అందజేస్తున్నందున గోదాములోని నిలువలను పరిశీలన చేశారు. స్టేజి వన్, స్టేజి 2 కాంట్రాక్టర్లతో మాట్లాడి వీలైనంత త్వరగా రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు.