షాద్‌నగర్ దాబాలో భారీ డ్రగ్స్ పట్టివేత
RR: షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్‌ప్లాజా దగ్గర ఉన్న సంజుభాయ్ మార్వాడీ దాబాలో చాలా కాలంగా జరుగుతున్న డ్రగ్స్ దందా గుట్టు రట్టయింది. పోలీసులు ఆపరేషన్ నిర్వహించి రూ. 3 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వికాస్ సాహు అనే ప్రధాన నిందితుడిని, ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను కూడా అరెస్టు చేశారు.