ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు మంత్రికి ఆహ్వానం
NRPT: మక్తల్‌లోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయ జాతర బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని ఆలయ ప్రధాన అర్చకులు, కమిటీ సభ్యులు శుక్రవారం మంత్రి వాకిటి శ్రీహరిని ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. జాతర ఏర్పాట్లు, భక్తులకు అవసరమైన సౌకర్యాల గురించి వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.