చెవిరెడ్డికి జైలులో వసతులు కల్పించండి: కోర్టు
AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో జైలులో చెవిరెడ్డికి సౌకర్యాలు కల్పించాలని అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్యం దృష్ట్యా జైలులో దిండు, పరుపు, ఫ్యాన్ ఇవ్వాలని చెవిరెడ్డి పిటిషన్ చేశారు. ప్రస్తుతం ఆయన మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.