'ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి'
NRML: నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ అన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశపెట్టిన ఉద్యోగ అవకాశాల పోస్టర్లను వారు శనివారం ఆవిష్కరించారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో చదువుకుంటూనే ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమ నైపుణ్యాలు, శిక్షణ, ఫెలోషిప్ అప్రెంటిస్‌లకు పొందవచ్చని అధ్యాపకులు ఈ సందర్భంగా తెలిపారు.