'సీఐటీయూ మహాసభలకు తరలిరావాలి'
MNCL: సీఐటియు రాష్ట్ర మహాసభలకు అందరూ తరలి రావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం హాజీపూర్ మండలంలోని గుడి పేట శివారులో ఉన్న బేవరేజ్ గోదాం వద్ద కార్మికులతో కలిసి ఆయన సీఐటీయూ రాష్ట్ర మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. మెదక్ పట్టణంలో డిసెంబర్ 7,8,9 తేదీలలో 5వ రాష్ట్ర మహా సభలు జరగనున్నాయని వెల్లడించారు.