వరల్డ్ లివర్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ

వరల్డ్ లివర్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ

ఖమ్మం: వరల్డ్ లివర్ డే సందర్భంగా సాయిరాం ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం ట్యాంక్‌బండ్ వరకు ర్యాలీచేశారు. కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్ ర్యాలీలో పాల్గొని బెలూన్లను ఎగురవేశారు. అనంతరం పలువురు వైద్యులు కాలేయ సంబంధిత వ్యాధులు, వాటిపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.