నేడు కలెక్టరేట్‌లో జాబ్ మేళా

నేడు కలెక్టరేట్‌లో జాబ్ మేళా

KMR: జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు బుధవారం (నేడు) జిల్లా కలెక్టరేట్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రజని కిరణ్ తెలిపారు. అపోలో ఫార్మసీలో 100 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయి. పదో తరగతి నుంచి ఫార్మసీ డిగ్రీ వరకు విద్యార్హత గలవారు అసలు ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు.