తప్పుడు వార్తల వ్యాప్తికి టెక్నాలజీతో అడ్డుకట్ట: అనిత
AP: టెక్నాలజీతో తప్పుడు వార్తలు వ్యాప్తి కాకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి అనిత తెలిపారు. ఆ దిశగా పోలీసులు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కల్పిత వీడియోల ద్వారా చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అలాంటి వారిని పోలీసులు కట్టడి చేస్తున్నారన్నారు. తుళ్లూరు పోలీసు సబ్ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ విధంగా మాట్లాడారు.