కార్యకర్తలే బీజేపీకి బలం: MP

కార్యకర్తలే బీజేపీకి బలం: MP

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల శంకర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలే పార్టీకి బలం అని అన్నారు. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.