లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధి మల్కాపూర్ ముంపు ప్రాంతాలను మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తోపాటు అదనపు కలెక్టర్ అరుణశ్రీ అధికారులు పరిశీలించారు. వరద నీరు ఒకేచోట నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తొలగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.