నేడు కడపకు రానున్న రామచంద్ర యాదవ్
KDP: భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ నేడు కడపకు రానున్నట్లు ఆయన పార్టీ ఆఫీసు నుంచి ప్రకటన వెలువడింది. చింతకొమ్మదిన్నె మండలం కొత్తపేట శివాలయంలో యాదవుల కార్తీక వనభోజన కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి రెండు గంటల వరకు అక్కడే అందుబాటులో ఉంటారని సమాచారం.