గుండెపోటుతో వ్యక్తి మృతి
RR: షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన నిర్మాత, ప్రముఖ వ్యాపారి దుష్యంత్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సన్నిహితులు తెలిపారు. చంద్రయన్ గూడ వద్ద ఉన్న ఫామ్ హౌస్ వద్ద అంత్యక్రియలు జరుపనున్నట్లు పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల సన్నిహితులు, పలువురు సంతాపం ప్రకటించారు.