గజ్వేల్లో ఒకే కాలనీకి ఆరు పేర్లు

SDPT: గజ్వేల్ పట్టణంలోని ఓ కాలనీకి ఆరు పేర్లు ఉండడం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న ఈ కాలనీని గతంలో వినాయకనగర్ కాలనీ, రెడ్డి కాలనీ అని పిలిచేవారు. తాజాగా ముదిరాజ్, యాదవ్, విశ్వకర్మ, ఆర్య వైశ్య కాలనీలుగా బోర్డులు పెట్టడంతో ఈ కాలనీకి ఒకేసారి ఆరు పేర్లు వచ్చాయి. ఒకే కాలనీకి ఇన్ని పేర్లు ఉండడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.