VIDEO: కారులో అకస్మాత్తుగా మంటలు

NGKL: వెల్దండ మండలం కొట్ర గేటు సమీపంలో శనివారం కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. పిట్ల సుధాకర్ తన బ్రీజా కారులో హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వస్తుండగా ఈ ఘటన జరిగింది. కారులో మంటలు చెలరేగగానే అప్రమత్తమైన సుధాకర్ బయటకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు నీటితో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.