రూబీ క్యూబ్స్‌తో అబ్బురపరుస్తున్న నోమేష్
నెల్లూరులో ఓ బాలుడు రూబీ క్యూబ్‌లో ప్రతిభ కనబరుస్తూ ఔరా అనిపిస్తున్నాడు. బీవీనగర్‌లో 7వ తరగతి చదువుతున్న నోమేశ్ బాలల దినోత్సవం సందర్భంగా నిన్న జరిగిన కార్యక్రమంలో కళ్లకు గంతలు కట్టుకుని 30 రూబీ క్యూబ్స్‌తో రాఫ్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫోటోను అమర్చి ప్రశంసలు అందుకున్నాడు. చదువులోనూ రాణిస్తూ క్యూబ్‌లతో ఆకట్టుకుంటున్న నోమేష్‌ను ఉపాధ్యాయులు అభినందించారు.