వ్యర్థాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన

వ్యర్థాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు బంగారిగూడలోని మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్‌ను సందర్శించారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ & ఈకో క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్షేత్ర పర్యటనలో, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రక్రియ, దాని ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.