నవంబరు 1న తలుపులకు సీఎం చంద్రబాబు
సత్యసాయి: కదిరి నియోజకవర్గంలోని తలుపుల మండలానికి సీఎం చంద్రబాబు నవంబరు 1న రానున్నట్లు సమాచారం. 'ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ' కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. సీఎం రాక నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.